వలిగొండ, అక్టోబర్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పైళ్ల శేఖర్‌రెడ్డిని ఆశీర్వదించాలని ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమ, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముభారక్ వంటి సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ఒటెయ్యాలని కోరారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిపొందని కుటుంబం లేవని, ప్రతిపక్ష నాయకులు చెప్పే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ముద్దాపురం, వెంకటాపురం గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల కమలాకర్, ఏఎంసీ చైర్మన్ పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మొగిళ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ పల్సం రమేశ్, కొమిరెల్లి సంజీవరెడ్డి, సోలిపురం సాగర్‌రెడ్డి, ఎమ్మె లింగస్వామి, రవీంద్ర, రత్నయ్య, గంగధారి రాములు, సత్యనారాయణ, పబ్బు వెంకటరమణ, సామ రాంరెడ్డి, కొత్త నర్సింహ, వెంకటేశం పాల్గొన్నారు.