కట్టంగూర్(నకిరేకల్): 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, 7 సంవత్సరాలు అధికార పార్టీగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే రాష్ర్టాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన సంద ర్భంగా గురువారం నకిరేకల్ క్యాంపు కార్యాలయం మెయిన్ సెంటర్లో జెండా ఎగురవేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షణాది రాష్ట్రల్లోనే ఏ పార్టీకి లేని విధంగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరికి గర్వకారణమన్నారు. పార్టీ బలోపేతనానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచిం చారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, కట్టంగూర్ ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, కేతేపల్లి మాజీ ఎంపీపీ గుత్తా మంజుల, నాయకులు కొమ్మనబోయిన సైదులు, బొజంజ సుందర్, గాదగోని కొండయ్య, బెజవాడ సైదులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.