భానుపురిలో మరో క్రీడా పండుగ
సూర్యాపేట మరోమారు క్రీడలకు వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మూడు ఈ పోటీలకు ఆతిథ్యం అందించనున్నారు. సొంత ఖర్చులతో వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 40జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
- ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు
- మూడు రోజులపాటు నిర్వహణ.. పాల్గొననున్న 40 జట్లు
- బాల, బాలికలు సహా హాజరుకానున్న 600 మంది ప్రతినిధులు
- వసతి, భోజన సౌకర్యం కల్పించనున్న మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- పోటీల కోసం స్థలాలను పరిశీలించిన రాష్ట్ర బాస్కెట్ బాల్
- అసోసియేషన్ అధ్యక్షుడు రావుల శ్రీధర్‌రెడ్డి
సూర్యాపేట టౌన్, మే 16 : సూర్యాపేట మరోమారు క్రీడలకు వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్‌షిప్ బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మూడు ఈ పోటీలకు ఆతిథ్యం అందించనున్నారు. సొంత ఖర్చులతో వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 40జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అందుకు అనువైన మైదానాల కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, శివారులోని లయోల పాఠశాల మైదానాలను పరిశీలించారు. అండర్-16 విభాగంలో జరిగే ఈ పోటీలకు బాల బాలికలతో సహా మొత్తం 600 మంది ప్రతినిధులు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. మొత్తం మీద మరోమారు సూర్యాపేటలో ఆటల సందడి ఉండనుంది.
మంత్రి జగదీశ్‌రెడ్డి క్రీడా ప్రేమికుడు
అడిగిన వెంటనే రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించడానికి ముందుకొచ్చి అన్నీ తానై నడిపిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి అసలైన క్రీడాభిమాని. మంత్రి చొరవతో బాస్కెట్‌బాల్ క్రీడకు ఆదరణ లభించడం ఖాయం. మంత్రి జగదీశ్‌రెడ్డికి అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు.
-ఫారూఖ్, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

