మిర్యాలగూడ, మార్చి 15 : మిర్యాలగూడ ఆర్డీఓగా జి.శ్రీనివాస్‌రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ బి.చెన్నయ్య జగిత్యాల భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జగిత్యాలలో పనిచేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రావు మిర్యాలగూడకు బదిలీపై వచ్చారు. ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.