కట్టంగూర్, ఆగస్టు 06 : తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై అలాగే జయశంకర్ సార్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని విశ్వకర్మ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాయబండి పాండురంగాచారి అన్నారు. బుధవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ సహకార సొసైటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి పాలకమండలి ఏర్పాటు చేయాలన్నారు. విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి రూ.10 కోట్లు కేటాయించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
50 సంవత్సరాలు నిండిన ప్రతి విశ్వకర్మ బిడ్డకు వృత్తి భరోసా కింద పింఛన్ రూ.5 వేలు ఇవ్వాలన్నారు. ఈ నెల 12న విశ్వకర్మ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పాదయాత్ర పోస్టర్ ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మండల జేఏసీ కన్వీనర్ విశ్వనాథుల జానాచారి, నాయకులు చిలకమర్రి పోతులూరు, నాగోజు వెంకటాచారి, నర్సింగోజు భిక్షమాచారి, పాలొజు జలేంద్రచారి, చొల్లేటి లింగాచారి, యాదగిరి చారి, నాగోజు శ్రీకాంత్, అల్లోజు నర్సింహ్మ, గదగోజు నర్సింహ్మచారి, అశోక్, వెంకన్న, రఘుబాబు, భార్గవ్ చారి పాల్గొన్నారు.