రామగిరి, మార్చి 27 : శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పచ్చని తోరణాలతో శోభాయమానంగా ఆలయాలను అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య జగథానుడి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. అభిజిత్ లగ్నం శుభ ముహూర్తాన సీతారాముల వారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండోవ భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామరచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ ఘట్టంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రామగిరిలో కల్యాణోత్సవంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్, నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి. 43వ డివిజన్ కార్పోరేటర్ కవితా దయాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూరి రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు