రామగిరి, ఏప్రిల్ 27 : నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం బీఈడీ కళాశాల ప్రాంగణంలోని శ్రీ కోటేశ్వరస్వామి దేవాలయం 26వ వార్షికోత్స బ్రహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే గణపతి పూజ, రుద్రాభిషేకాలు, హోమం, నవగ్రహా ఆరాదన వేద పండితుల మంత్రోచ్చరణలతో శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం జరిపించారు. వేడుకకు చర్లపల్లి, పరిసర ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు, డీవీఎం విద్య శిక్షణ కళాశాలల అద్యాపకులు, విద్యార్థులు హాజరై తిలకించారు. అనంతరం స్వామి అమ్మవార ప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. రుత్విక్కులకు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జయప్రకాష్ నారాయణ కాలేజీ ఆఫ్ ఇం.ఇనీరింగ్(జెపీఎన్సీఈ) చైర్మన్ కె.ఎస్.రవికుమార్ దంపతులు, డీవీఎం విద్యా సంస్థల నిర్వహకులు దొడ్డా నాగరాజు శాంతికుమారి, దొడ్డా శాంతికుమార్ నందిని, దొడ్డా సాయి సంజయ్ అతిథి, కోటాల సాయితేజ- శ్రావ్య, డీవీఎం విద్యా సంస్థల సూపరింటెండెంట్ చోల్లేటి శ్రీధరాచారి, డీవీఎం బీఈడీ, ఎంఈడీ, డీఈడీ, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్స్, అద్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా శ్రీపార్వతి కోటేశ్వరస్వామి కల్యాణోత్సవం