నల్లగొండ, ఆగస్టు 11 : నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వప్న హాస్పిటల్, నల్లగొండ ఆధ్వర్యంలో సోమవారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత, డాక్టర్ స్వప్న మాట్లాడుతూ.. విద్యార్థి, విద్యార్థినులకు క్రీడా దుస్తులు అందజేయడమే కాకుండా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో తమ సహాయ సహకారాలు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ సందర్భంగా దాతలు డాక్టర్ స్వప్న, రామ్మోహన్ను పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సత్యనారాయణ, శేఖర్, అబ్బాస్ అలీ, మల్లారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఎండీ షరీఫ్, యాదగిరి, శోభారాణి, మల్లేశ్, గిరి, సైదమ్మ, హాస్పిటల్ సిబ్బంది బాబర్ పాల్గొన్నారు.
Nalgonda : ఎర్రబెల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ