కోదాడ, ఆగస్టు 11 : క్రీడలతో పని ఒత్తిడి అధిగమించవచ్చని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. పంద్రాగస్టును పురస్కరింకుని సోమవారం కోదాడ కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. చెస్, క్యారమ్స్, షటిల్ లాంటి ఆటలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. న్యాయవాదులు ఆటల ద్వారా తమ పని ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. ఆటలు మానసిక, శారీరక దృఢత్వానికి, ఐక్యతకు, స్నేహ భావానికి దోహదం చేస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.లక్ష్మీనారాయణ రెడ్డి, కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య, గేమ్స్ కార్యదర్శి బండారు రమేశ్ బాబు, సీనియర్ న్యాయవాదులు వై.సుధాకర్ రెడ్డి, మేకల వెంకట్రావు, తమ్మినేని హనుమంతరావు, రంజాన్ పాషా, సాధు శరత్ బాబు, సిలివేరు వెంకటేశ్వర్లు, యశ్వంత్, ఈదుల. కృష్ణయ్య, కోడూరు వెంకటేశ్వర్లు, గోవర్ధన్, రియాజ్ పాల్గొన్నారు.