నల్లగొండ, జూన్ 13 : రోడ్డు భద్రతను మెరుగుపరచడం, మోటారు వాహనాల చట్టం-1988 నిబంధనల అమలును నిర్ధారించడం, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీలలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి అలాగే సూర్యాపేట జిల్లాల్లో అధికారులు, సిబ్బంది మొత్తం 130 వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.
నల్లగొండ జిల్లా
తనిఖీ చేసిన వాహనాలు – 40
నమోదు చేసిన కేసులు – 2
యాదాద్రి భువనగిరి జిల్లా
తనిఖీ చేసిన వాహనాలు – 45
నమోదు చేసిన కేసులు – 0
సూర్యాపేట జిల్లా
తనిఖీ చేసిన వాహనాలు – 45
నమోదు చేసిన కేసులు – 1
మొత్తం :
తనిఖీ చేసిన వాహనాలు – 130
నమోదు చేసిన కేసులు – 3
తనిఖీల సందర్భంగా వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్, పర్మిట్, ఇతర చట్టబద్ధ పత్రాలను పరిశీలించారు. రవాణా శాఖ అధికారులు వాహన యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలను కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఇటువంటి ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు భవిష్యత్లో కూడా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.