నల్లగొండ సిటీ, మే 29 : ప్రతి నెల చివరి శనివారం (మే 30) నాడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారిని కేవీ కృష్ణవేణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా దివ్యాంగుల కోసం అలాగే వయో వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు, ఈ అవకాశాన్ని జిల్లాలోని వయో వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు.