‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
నల్లగొండ నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ కార్పోరేషన్లో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదుకు..
– నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి
నీలగిరి, అక్టోబర్ 29 : నల్లగొండ నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండ కార్పోరేషన్లో పారిశుధ్య కార్మికుల హాజరు నమోదుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్), వాహనాల పనితీరు పర్యవేక్షణకు క్యూఆర్ కోడ్ ఆధారిత విధానాన్ని అమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల హాజరును ఎస్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయడం వల్ల విధులకు హాజరయ్యే సిబ్బంది వివరాల్లో పారదర్శకత పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల నిర్వహణను మెరుగ్గా పర్యవేక్షించేందుకు వీలవుతుందన్నారు. అదేవిధంగా, పారిశుధ్య వాహనాల నిర్వహణకు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానం ద్వారా వాహనాల రాకపోకలు, చెత్త సేకరణ, డంపింగ్ వివరాలు, డీజిల్ వినియోగం, వాహనాల పనితీరు, మరమ్మతుల అవసరాలను పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఈ విధానాలు సమర్థవంతమైన పర్యవేక్షణకు దోహదపడటంతో పాటు, సమయం, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, కమిషనర్ బి. వంశీకృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక దంత పరీక్షలు
నల్లగొండ నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీ సత్య డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. శిబిరంలో డాక్టర్లు అరబింద్ రెడ్డి, శాంక్, నందిని, ఎం.డి.నజీర్ ఖాన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, కమిషనర్ బి.వంశీకృష్ణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అదికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

