ఆత్మకూర్.ఎస్, జూలై 16 : విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీసు ప్రజా భరోసాలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. బాలికలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి సందర్భాల్లోనైనా భయాందోళనకు గురి కాకుండా డయల్ 100, 8712686056కు ఫిర్యాదు చేయాలన్నారు. బాలికల మహిళల రక్షణలో పోలీసుశాఖ నిరంతరం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎంఈఓ దారాసింగ్, ఎస్ఐ శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు సరస్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోతె, జూలై 16: విద్యార్థినులు తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అవగాహన కల్పించారు.
మునగాల, జూలై 16: విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదగాలని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎస్వో సునీతారాణి, రవి పాల్గొన్నారు.
చివ్వెంల, జూలై 16: బాలికలు ప్రతి సమస్యను అధిగమించాలని సీఐ వెంకటయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పోలీసు ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పెన్‌పహాడ్, జూలై 16: విద్యార్థులను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపికృష్ణ, ప్రిన్సిపల్ ఆసియా జెబిన్, ఏఎస్ఐ రాములు, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్‌రెడ్డి, యాదగిరి, కానిస్టేబుల్ ప్రవీణ్, రేణుక, శైలజ, రవినాయక్ ఉన్నారు.
గరిడేపల్లి, జూలై 16: చదువుపై ఆసక్తి పెంచుకోవాలని హుజూర్నగర్ సీఐ చరమంద రాజు సూచించారు. బుదవారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పోలీస్ భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఎస్వో శైలజ, మహిళా కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.