Kodada : కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట చిరు వ్యాపారుల నిరసన
కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న డబ్బా కొట్లు, మండపం ఏరియాలో ఉన్న డబ్బా కొట్లను తొలగించి తమను రోడ్డున పడేయవద్దంటూ చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు.
కోదాడ, జులై 02 : కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న డబ్బా కొట్లు, మండపం ఏరియాలో ఉన్న డబ్బా కొట్లను తొలగించి తమను రోడ్డున పడేయవద్దంటూ చిరు వ్యాపారులు మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ.. తాము గత 30 సంవత్సరాలుగా చిన్న, చిన్న డబ్బా కోట్లు ఏర్పాటు చేసుకుని కుట్టు మిషన్లు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికిప్పుడు తమను ఖాళీ చేయిస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ రాత పూర్వకంగా నూతనంగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో తమకు షాపులు కేటాయిస్తామని హామీ ఇస్తే సహకరించి ఖాళీ చేస్తామన్నారు. లేని పక్షాన బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే అందరం కలిసి అడ్డుకుంటామని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

