కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 16 : బైక్ను కారు ఢీన్న ప్రమాదంలో అక్క మృతి చెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్ర సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ అజ్మీరా రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలానికి చెందిన సంకు లింగారెడ్డి తన అక్క పాశం విజయను (52) టీవీఎస్ వాహనంపై కొండమల్లేపల్లికి తీసుకు వస్తుండగా చిన్నఅడిశర్లపల్లి గ్రామ సమీపంలో గల ధన్వి ఫంక్షన్ హాల్ 167వ జాతీయ రహదారిపై నాగార్జునసాగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి లింగారెడ్డి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో విజయ రోడ్డుపై పడి ముక్కు, చెవుల నుండి రక్తం కారడంతో 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. లింగారెడ్డి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.