తుంగతుర్తి, సెప్టెంబర్ 11 : తుంగతుర్తి మండలం అన్నారంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) మండల స్థాయి హెచ్ఎఫ్ క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత రాణి జ్యోతి ప్రజ్వలన చేయగా ఎంఈఓ బోయిని లింగయ్య, అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల పట్ల స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహద పడుతుందని చదువుతో పాటు క్రీడల్లోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చిఫాస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిడి కొండగడుపుల యాకయ్య, బింగి వెంకటేశ్వర్లు, ఎండి మజీద్, యాదగిరి పాల్గొన్నారు.

ఎస్జీఎఫ్ తుంగతుర్తి మండల స్థాయి క్రీడలు ప్రారంభం