వేములపల్లి, జూన్ 14 : వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో అద్దంకి – నార్కట్పల్లి రహదారి వెంట మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారి వెంట మురుగు కాల్వల నిర్మాణాన్ని ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడంతో రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహిస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్యానికి గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు కాల్వల నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుతున్నారు.