జనవరి 31 : బీబీనగర్ మండలంలోని బొల్లేపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసకున్నారు. తల్లి పిన్నింటి విజయశాంతి (38) సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా.. కూతురు చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఫిబ్రవరి 3 : బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఐశ్వర్య(28) అనే తల్లి పది నెలలు, మూడేండ్ల చిన్నారులను చంపి.. ఆపై తాను సైతం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటనలో మొత్తం ముగ్గురు చనిపోయారు.
మార్చి 15 : భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన రత్నకళ తన కుమార్తె కీర్తనరెడ్డి(14)ని కత్తితో గొంతు కోసి హతమార్చింది. అక్కడే ఉన్న కుమారుడు అంశాంత్ రెడ్డిపైనా కత్తితో దాడికి యత్నించింది. అయితే బాలుడు తృటిలో తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఏప్రిల్ 15 : భువనగిరి మండలం హన్మాపురంలో తండ్రి శ్రీరాములు తన రెండేండ్ల కూతురిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : పెద్దలు, తల్లిదండ్రుల ఆవేశం అభం శుభం తెలియని చిన్నారుల ఉసురు తీస్తోంది. ముక్కు పచ్చలారని పసికందులు ప్రాణాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. అన్నెం పున్నెం తెలియని అమాయక పిల్లలను అంతమొందిస్తున్నారు. ఇదంతా చేస్తున్నది ఎవరో కాదు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే . చిన్న తగాదాలు, వ్యక్తిగత కారణాలతో క్షణికావేశంలో పిల్లల నిండు జీవితాలను బలిపెడుతున్నారు. యాదాద్రి జిల్లా లో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
భార్యభర్తల మధ్య గొడవలకు చిన్నారులు బలి అవుతున్నారు. కుటుంబ కలహాలు, చిన్న చిన్న కారణాలతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఏ పాపం తెలియని పసిపిల్లల ఉసురు తీస్తున్నారు. వివాహేతర సంబంధాలు, వరకట్న వేధింపులు, భర్త వేధింపులు, కుటుంబ కలహాలు తదితర కారణాలతో క్షణికావేశంలో అనాలోచితంగా వ్యవహరిస్తున్నారు. తొమ్మిది నెలలు మోసిన తల్లి, కష్టపడి పెంచిన తండ్రి తమ చేతులతోనే పిల్లల్ని చిదిమేస్తున్నారు. తాను చనిపోతే తన పిల్లల పరిస్థితి ఏంటనే నిర్ణయంతో తమతోపాటే పిల్లలను చంపుతున్నారు. బీబీనగర్ మండలం గొల్లగూడెంలో ఓ తల్లి సూసైడ్ నోటులో స్వయంగా ఇదే ప్రస్తావించింది. మానసికంగా ఇబ్బందులు ఉంటే సైక్రియాట్రిస్టును సంప్రదించాలని, అంతేకాని పిల్లలను చంపి కసాయిగా మారొద్దని మానసిక వైద్యలు సూచిస్తున్నారు.
భువనగిరికలెక్టరేట్, ఏప్రిల్ 15: కన్న కూతురుని అతిదారుణంగా గొంతునులిమి హత్య చేసిన హృదయ విదారక సంఘటన మం డలంలోని హన్మాపురంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెం దిన ఎర్రబోయిన శ్రీరాము లు పుట్టుకతో చెవిటి, మూ గవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన కూతురు నిత్యశ్రీ(24నెలలు)ని ద్విచక్ర వాహనంపై బలవంతంగా తీసుకెళ్లి గ్రామశివారులో గొంతు నులిమి హత్య చేశాడు.

కొద్దిసేపటి తరువాత శ్రీరాములు తన అన్న రాజుకు వీడియోకాల్ చేసి ని త్యశ్రీ లేవడం లేదంటూ చూపించాడు. హుటాహుటి న ఘటనా స్థలానికి వెళ్లిన రాజు అచేతనంగా పడి ఉ న్న నిత్యశ్రీని భువనగిరి జ నరల్ దవాఖానకు తీసుకెళ్లాడు. అప్పటికే నిత్యశ్రీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక తా త మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మిర్చా ల అనీల్‌కుమార్ తెలిపారు.