పెద్దవూర, నవంబర్ 26 : తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల పెద్దవూర నందు బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థులు అలరించారు. మంచి ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మంగ్త భూక్యా, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ మధుసూదన్, నాగిరెడ్డి, పరశురామ్, డాక్టర్ యాదగిరి, ప్రభాకర్, లక్ష్మిచైతన్య, లతీఫ్, సైదులు, పీడీ, పీఈటీ, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.