మిర్యాలగూడ టౌన్, జనవరి 2 : 67వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల జూనియర్ బాల్‌బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు మిర్యాలగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఆర్.రవీంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు ఈనెల 12 నుంచి 14 వరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో జరుగనున్నట్లు చెప్పారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని విద్యార్థులకు సూ చించారు. ఎంపికైన బి.రాజేశ్, పి.హర్షిత్, కె.మహిపాల్, జి.సుశాంత్‌ను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాములు, పీఈటీ యు.గురువయ్య, పీడీ లక్షణ్, సృజన్‌కుమార్, శంకర్‌నాయక్, జానకమ్మ పాల్గొన్నారు.