విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు
విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బిక్కి వెంకటయ్య అన్నారు.
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బిక్కి వెంకటయ్య
- మృతిచెందిన విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేస్తాం
సూర్యాపేట రూరల్/బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 20 : విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం అవుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బిక్కి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట మండల పరిధి ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు చావే కారణం కాకుడాదని, ఏమైనా ఉంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినుల ఆత్మహత్యల ఘటనలు పునరావృతం కాకుండా అన్ని సంక్షేమ పాఠశాలలో మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చనిపోయిన విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం అందేలా తమ కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు.
అనంతరం పాఠశాలలో తరగతి గదులు, భోజనశాలను, మరుగుదొడ్లను కమిటీ సభ్యులు పరిశీలించారు. వైష్ణవి, ఆస్మిత చిత్ర పటాలకు నివాళులర్పించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. వారి వెంట ఆర్డీఓ సీహెచ్.కృష్ణయ్య ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

