నందికొండ, జూన్ 18 : నాగార్జునసాగర్ డ్యామ్ స్పీల్వే మరమ్మతులను ఆధునిక పద్ధతిలో చేపట్టడానికి ఎంవైకే కంపెనీకి చెందిన కుల్దీప్ తివారి, శ్రీకాంత్‌రాజ్, ఆదిత్య విక్రమ్, సుజిత్ చంద్ర, ఎస్ఎస్పిఐ కంపెనీకి చెందిన ప్రశాంత్ బృందం సభ్యులు బుధవారం స్పీల్‌వేను పరిశీలించారు. నాగార్జుసాగర్ డ్యామ్ దిగువన ఉన్న స్పీల్వే బకెట్ పోర్షన్ వెంబడి నడుచుకుంటూ స్పీల్వే పై ఏర్పడిన గుంతలను ఎన్ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నప్పుడు డ్యామ్‌కు ఏర్పాటు చేసిన రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు. రేడియల్ క్రస్ట్ గేట్ల నుండి స్పీల్వే మీదుగా 300 అడుగుల ఎత్తు నుంచి బకెట్ పోర్షన్లోకి నీరు అధిక వత్తిడితో దిగువకు వస్తుంది. ఈ క్రమంలో నీటి ఒత్తిడికి డ్యామ్ స్పీల్వేపై గుంతలు ఏర్పడుతాయి. ప్రతి ఏటా ఈ స్పీల్వే గుంతలను పూడ్చనికి కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
గతేడాది రూ.20 కోట్లతో స్పీల్వే పనులను చేపట్టారు. క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల అనంతరం మరల స్పీల్వే పై గుంతలు ఏర్పడ్డాయి. స్పీల్వే గుంతలకు శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపడ్డడంతో, దీనిలో భాగంగా ఎంవైకే, ఎస్ఎస్పిఐ కంపెనీ సభ్యులు స్పీల్‌వేను పరిశీలించారు. ఈ కంపెనీల ప్రతిపాధనలను ప్రభుత్వం అంగీకరిస్తే ఈ ఏడాదిలో కొంత వరకు స్పీల్వే పనులు చేపడతారని, లేనిపక్షంలో వచ్చే ఏడాదే స్పీల్వే పనులు ఉంటాయిని కంపెనీ సభ్యులు తెలిపారు. జూలై నెల చివరిలోకి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏడాది స్పీల్వే పనులు చేసే అవకాశం లేదని రిటైర్డ్ ఇంజినీర్లు అంటున్నారు.
Nandikonda : ఆధునిక పద్దతిలో సాగర్ డ్యామ్ స్పీల్వే మరమ్మతులు!