కోదాడ టౌన్, మే 24 : వాహనాల ఫ్యాన్సీ నంబర్ కోసం వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు, సెంటిమెంట్ కోసం మరికొందరు తమకు కలిసి వచ్చే నంబర్లను పొందుతున్నారు.
కోదాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాస్‌రావు ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన తన టయోటా ఫార్చునర్ లెజెండ్ కారు నంబర్ కోసం రూ.3,50,999 చెల్లించారు. శనివారం కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆన్లైన్ బిడ్డింగ్‌లో టీజీ 29ఏ 9999 నంబర్‌కు రికార్డు స్థాయిలో డబ్బులు ప్రభుత్వానికి చెల్లించి దక్కించుకున్నారు.