కోదాడ, ఆగస్టు 04 : కోదాడ పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని రిశ్విని ఖమ్మంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీలు అండర్ – 12 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి గోవర్ధన్, ఉపాధ్యాయులు కన్నయ్య, రాయుడు, నాంచారయ్య, రవీందర్ పాల్గొన్నారు.