కోదాడ రూరల్, జులై 04 : పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గల నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారి కుటుంబాలు గడవడమే కష్టతరంగా మారింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కోదాడ రూరల్ మండలం కాపుగల్లు గ్రామ నాయకుడు దొంతగాని అప్పారావు శుక్రవారం 10 మంది పంచాయతీ కార్మికులకు 25 కేజీల చొప్పున బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అదే విధంగా గ్రామంలో వీధి దీపాలు వెలగక పోవడం తెలుసుకుని రూ.లక్ష విలువ గల 100 ఎల్ఈడీ బల్పులను అందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి వెంకటనారాయణ దాతను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కటికాల సతీశ్, ఓర్సు గోపి, ఏసుపాదం, గ్రామ పెద్దలు, పంచాయితీ కార్మికులు పాల్గొన్నారు.