పెన్‌పహాడ్, జూలై 02 : ట్రాక్టర్ ఢీకొని విశ్రాంత పోస్ట్ మాస్టర్ మృతి చెందిన సంఘటన పెన్‌పహాడ్ మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కన్మంతరెడ్డి కృపాకర్ రెడ్డి (70) వ్యవసాయ పనులు కోసం పొలం వద్దకు వెళ్లి తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో కృపాకర్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కృపాకర్‌రెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె ఉన్నారు. భార్య కన్మంతరెడ్డి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపి కృష్ణ తెలిపారు.