తుంగతుర్తి, ఏప్రిల్ 09 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేలా చూడాలని కోరుతూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు.
అనంతరం ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, మండల నాయకులు తునికి సాయిలు, గుడిపాటి వీరయ్య, మట్టిపెల్లి కవిత, మల్లెపాక రాములు, కన్నెబోయిన ప్రసాద్, నాయకులు సోమేశ్, వీరు, శంకర్, నాగు, యాదగిరిరెడ్డి, యాకూబ్, చింతకుంట్ల సురేశ్ పాల్గొన్నారు.