రామగిరి, ఆగస్టు 11 : 1962 సంవత్సరంలో రేజాంగ్ల అనే ప్రాంతంలో ఇండియా-చైనాల మధ్య జరిగిన యుద్ధంలో 1,300 మందిని హతమార్చి, తర్వాత 120 మంది యాదవ యుద్ధ వీరులు వీరమరణం పొందిన వీరులకు గుర్తింపుగా “యాదవ రెజిమెంట్” ప్రకటించాలని అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో “రేజాంగ్ల రజ్ కలశ యాత్ర” రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ నల్లగొండ జిల్లా సరిహద్దు చేరుకున్న యాత్ర కలశాన్ని సోమవారం అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, నల్లగొండ జిల్లా వాసి, ప్రముఖ న్యాయవాది లోడంగి గోవర్ధన్ యాదవ్, ఆ మహాసభ నల్లగొండ ప్రతినిధి ముచ్చర్ల ఏడుకొండల యాదవ్‌తో కలిసి స్వీకరించారు. అక్కడి నుంచి యాత్రను వారు కొనసాగిస్తూ ఈ నెల 12న నల్లగొండకు చేరుకోనున్నారు. నల్లగొండ జిల్లాకి విచ్చేయుచున్న సందర్భంగా యాదవ బంధు మిత్రులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఉదయం 10:00 గంటలకు దేవరకొండ
మధ్యాహ్నం 12:00 గంటలకు కొండమల్లేపల్లి
మధ్యాహ్నం ఒంటిగంటకు గుర్రంపూడ్
మధ్యాహ్నం 2:00 గంటలకు కనగల్లు
మధ్యాహ్నం 3:00 గంటలకు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో సమావేశం కలదు