నల్లగొండ : నల్లాగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ నల్లగొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ, గుత్తా సుఖేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు రాంచంద్రనాయక్, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, జడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, చిట్యాల pacs చైర్మన్ మల్లేష్ గౌడ్, వ్యవసాయ కమిటీ ఛైర్మన్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.