సూర్యాపేట టౌన్, డిసెంబర్ 31 : పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం రాములు అందించిన సేవలు అభినందనీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నేరేడుచర్ల ఏఎస్ఐ రాములు ఉద్యోగ విరమణ అభినందన సభలో ఎస్పీ పాల్గొని ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాములు విధుల పట్ల అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఅర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, ఏఓ మంజు భార్గవి, డీఎస్పీ నరసింహచారి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.