రామన్నపేట, అక్టోబర్ 22 : బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, బట్టె కృష్ణమూర్తి, యువ నాయకుడు గోదాసు ప్రవీణ్, పెండెం వేణుతో పాటు మరో 300మంది కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఆదివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో కొండె నవీన్, ఉప్పల బుచ్చయ్య, సత్తయ్య, నర్ర ఆండాలు, కడారి మల్లేశం, జాల శేఖర్‌రెడ్డి, కాలేరు సత్తయ్య, పోత్కాని శ్రీను, జానిబాబా, పోత్కాని ప్రకాశ్, లవణం ఉపేందర్, అశోక్, భూపతి నరేందర్, బచ్చ లింగస్వామి, కడగంచి అయిలయ్య ఉన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, మాజీ మండలాధ్యక్షుడు బందెల రాములు, ఎంపీటీసీ గొరిగె నర్సింహ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పోతరాజు సాయి, జాడ సంతోష్, కన్నెబోయిన బలరాం, ఉపసర్పంచ్ పొడిశేటి కిషన్, పోతరాజు శంకరయ్య, బొడ్డు వెంకటేశం, గర్దాసు విక్రం, బత్తుల వెంకటేశం, బాలగోని శివ, లవణం రాము, మన్సూర్ అలీ, ఎండీ.నాసర్, గోదాసు శివనారాయణ, బొడ్డు అల్లయ్య, ఈతాపుల క్రాంతి, కల్లూరి నరేశ్, జాడ అమరేందర్‌రెడ్డి, ఉపేందర్, సాయి పాల్గొన్నారు.