కోదాడ, మే 12 : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) ఫలితాల్లో కోదాడ పట్టణానికి చెందిన రేస్ ఐఐటీ, మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఎఫ్ సెట్ విభాగంలో కళాశాలకు చెందిన తిప్పన రోహిత్ రెడ్డి 1,302, పోసాని వంశీ 1,881, పల్లా సూర్య ప్రకాశ్ 2,976, యలగొండ దీపిక 3,125, కట్టమూరి కీర్తన 4,410, బాణాల మహా శ్రీ కౌశిక్ 4,871, కుసుమ విక్షిత కుమార్ 4,921, జనగాం ఓజస్వి 5,472, సయ్యద్ హుజూఫా 5,956, కొండ చక్రధర్ గౌడ్ 6,338, అక్కినేపల్లి గగన్ కుమార్ 6,482, కుంటిగొర్ల మణికంఠ 6,635, షేక్ అంజుమ్ 7,731, శివ జ్యోతి 7,840, షేక్ సమీర్ 8,656, బానోత్ మధు ప్రసాద్ 8,934, సన్నీ 9,688 ర్యాంకులు సాధించారు. అలాగే మెడికల్ విభాగం నుండి సన్నపరెడ్డి సిరి 8,245, మహమ్మద్ మోహిసిన్ 9,745 ర్యాంకులు సాధించారు.
ఈ సందర్భంగా రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి ఇంజినీరింగ్, మెడికల్ విభాగంలో ప్రతి సంవత్సరం అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ ర్యాంకులు సాధిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్లో ఇంకా అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. ర్యాంకుల సాధనలో కృషిచేసిన అధ్యాపకులు, విద్యార్థులను ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా అభినందించారు.