
నాంపల్లి: నేను చేసిన తప్పు..పెళ్లి చేసుకోవడమే నేను చనిపోవడానికి నా భార్య ప్రణీత, వాళ్ల అన్న నరేశ్, అక్క నారాయ ణమ్మ, అక్క పెద్ద కొడుకు ఆంజనేయులు కారణం అంటూ ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు న్న ఘటన మండలంలోని గనుగపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే గనుగపల్లి గ్రామనికి చెందిన కటం చిన్న నర్సింహా, యాదమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
కాగా కటం శివ(26)కు పీఏ పల్లి మండలం చిన్న అడిశర్లపల్లికి చెందిన ప్రణీతతో 19నెలల క్రితం వివాహం జరిగింది. వారికి సంవత్సరం పాప ఉంది. తిరుపతిలో పాప తలనీలాలు సమర్పించి శనివారమే ఇంటికి వచ్చారు. ఇదిలా ఉండగా భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కూడా వారి ఇద్దరి మధ్య వాగ్వా దం జరుగగా ప్రణీత అన్న నరేశ్, అక్క నారాయణమ్మ, అక్క పెద్ద కొడుకు ఆంజనేయులు తోనూ శివ గోడవపడినట్లు బంధువులు తెలిపారు.
ఈ క్రమంలో ప్రణీతను వాళ్ల అన్న ఇంటికి తీసుకెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేకపొవడంతో పురుగల మందు తాగి చనిపోతు నట్లు అతని బంధువులకు వాట్సఫ్ ద్వారా మెసేజ్ పంపగా బంధువులు గ్రామస్తులకు తెలిపారు. వెంటనే చుట్టుపక్కల వారు వెళ్లి తలుపులు తట్టినా ఎంతకు తీయకపొవడంతో తలుపులు పగులగొట్టి 108 వాహనంలో దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఎంఢీ రఫీని వివరాలు అడగ్గా సమాచారం తెలిసిందని, ఇంకా ఏవరూ పిటిషన్ ఇవ్వలేదని తెలిపారు.