తిరుమలగిరి, జూన్ 02 : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో రైతులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంలో ప్యూరిఫైడ్ వాటర్ కేంద్రం ఏర్పాటు చేయటం హర్షనీయం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం ప్యూరిఫైడ్ వాటర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మార్కెట్లో రైతులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. మార్కెట్కు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ చామంతి, పార్టీ మండలాధ్యక్షుడు నరేశ్, పీఏసీఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.