ఆత్మకూర్.ఎస్, మే 12 : కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజా పోరాటాల నిర్మాణమే ఏకైక మార్గమని మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు గ్రామంలో సీపీఎం మండల కార్యదర్శి అవిరె అప్పయ్య అధ్యక్షతన ఏపూరు ఎర్రజెండా ముద్దు బిడ్డ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సొంత గ్రామం ఏపూరులో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు.
కామ్రేడ్ ఓంకార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొంటు భూమి, భుక్తి, విముక్తి పోరాటంలో అగ్రభాగాన నిలిచారన్నారు. సాయుధ పోరాట విరమణ తర్వాత నర్సంపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికై అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడిన తీరు అన్ని వర్గాలకు ఆదర్శం అని కొనియాడారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం ఓంకార్‌తో కలిసి చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి ఆదర్శం అన్నారు. అంతకుముందు ఓంకార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో ప్రజా నాట్యమండలి కళాకారులు ఆలపించిన అమరవీరుల గేయాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. సభ అనంతరం ఓంకార్ శత జయంతి సందర్భంగా అమర జ్యోతిని మల్లు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎం సిపిఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఓంకార్ పెద్ద కుమారుడు మద్దికాయల సుధాకర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎం సిపిఐ( యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, బెల్లంకొండ సత్యనారాయణ, ఓంకార్ కోడలు మద్దికాయల ప్రభావతి, ఎం సిపిఐ (యూ) నాయకులు వస్కుల సైదమ్మ, ఏపూరి సోమన్న, నక్క శ్రీనివాస్, పోతుగంటి కాశి, సీపీఎం సీనియర్ నాయకులు అబ్బగాని భిక్షం, మండల కమిటీ సభ్యులు సానబోయిన ఉపేందర్, నూకల గిరిప్రసాద్ రెడ్డి, వరికుప్పల మహేశ్, ఎరుకలి నాగరాజు, నాయకులు యాతాకుల వెంకన్న, న్యూ డెమోక్రసీ నాయకులు సూదగాని వెంకన్న, జిలేరు, ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు బచ్చలకూర రాంబాబు, కాంపాటి శ్రీను, శ్రీకాంత్, పిడమర్తి అశోక్ పాల్గొన్నారు.