అంగన్వాడీల్లో చిన్నారుల సమగ్ర వికాసం
నేటి బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేమైన దృష్టి సారించి వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది.
- ఎత్తు, బరువు తగ్గట్టు చిన్నారులకు పోషకాహారం అందజేత
- హెల్త్‌కార్డులో ప్రతి నెల వివరాలు నమోదు
- పోషకాహార లోపం చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
నీలగిరి, మే 5 : నేటి బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేమైన దృష్టి సారించి వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు వయస్సుకు తగిన విధంగా ఎదుగుదల, ఎత్తుకు తగిన బరువుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కార్డులో నమోదు చేస్తూ తగిన చర్యలు చేపడుతుంది. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పాలు, గుడ్లు, బాలామృతం, స్నాక్స్‌లను అందిస్తుంది.
ప్రతినెల వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షణ కార్డులో నమోదు చేస్తు వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. జిల్లా వ్యాప్తంగా 1,831 అంగన్వాడీ కేంద్రాలు, 262 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసు ఉన్నవారు 44,265 మంది. 3 నుంచి 6 ఏండ్ల వయసు వారు 25,964 మంది ఉన్నారు. హెల్త్ ప్రొఫైల్ కార్డులో వారి వ్యక్తిగత సమాచారం నమోదు చేస్తున్నారు. తద్వారా బలహీనంగా ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అదనంగా పోషకాహారం అందిస్తున్నారు.
చిన్నారులకు అందించాల్సిన ఆహారం..
తల్లి పాలలో ఉన్న పోషకాలు బిడ్డ ఏడో నెల తర్వాత నుంచి సరిపోవు. ఈ సమయంలో పిల్లలకు పోషకాహారం తప్పనిసరి అవుతుంది. శిశువుకు ఇచ్చే ఆహారం సులభంగా మింగేలా ఉండాలి. బియ్యం, గోధుమ, జొన్న, సజ్జలతో పాటు పెసర, శెనగ, పుట్నాలు, వేరుశెనగ, నువ్వులు, చక్కెర, బెల్లం తదితర పదార్థాలతో ఈ పోషకాహారాన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్‌గా బిస్కెట్లు, బ్రెడ్, అరటిపండ్లు, ఉడికించిన ఆలుగడ్డలు కూడా తినిపించాలి. వేరుశెనగ, ఎండుకొబ్బరి, బాదంలలో ఎక్కువగా శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. అలాగే బిడ్డకు ఇచ్చే ప్రతి భోజనంలో ఒక చెంచా నెయ్యి, నూనె ఉండేలా చూసుకోవడం మంచిది.
పర్యవేక్షణ కార్డు ద్వారా ఏం చేస్తారంటే..
- ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 0 నుంచి 5 ఏండ్ల చిన్నారుల బరువు, ఎత్తు, భుజం చుట్టుకొలత ప్రతి నెల కార్డులో నమోదు చేస్తారు
- కార్డులో ఆకుపచ్చ రంగు సాధారణ స్థాయి, పసుపు రంగు ఎకువ పోషణ లోపం, ఎరుపు రంగు తీవ్ర పోషణ లోపాన్ని సూచిస్తాయి. దాని ప్రకారం చిన్నారికి తగిన పోషకాహారం అందిస్తారు
- షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు నులి పురుగుల మాత్రలు, ఐరన్ ఫోలిక్, యాంటీబయాటిక్, విటమిన్స్ మందులు అందిస్తారు.
పోషకాహారం వల్ల కలిగే లాభాలు….
వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత, శక్తి, మాంసకృతుల లోపం, అయోడిన్, విటమిన్ ఏ,బీ లోపాలకు గురికాకుండా ఉంటారు. బరువు తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం వంటి సమస్యల నుంచి బయటపడుతారు. ముఖ్యంగా పిల్లల్లో గ్రహించే శక్తి, ఏకాగ్రత, తెలివితేటలు పెరుగడంతో పాటు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు.
పోషకాహారం అందిస్తున్నాం
ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన పోషక ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. దీని కోసం ప్రతి నెల చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని కార్డులో నమోదు చేసి వారి తల్లిదండ్రులకు అందజేస్తున్నాం. పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు పెరుగుదలను పరిశీలిస్తున్నాం.
– తూముల నిర్మల, సీడీపీఓ,
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

