నల్లగొండ రూరల్, ఆగస్టు 26 : గొర్రెలు, మేకలకు వచ్చే పారుడు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పి పి ఆర్ వ్యాక్సిన్‌ను పెంపకందారులు తప్పక వేయించాలని నల్లగొండ మండల పశువైద్య అధికారి కోట్ల సందీప్ రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని దోమలపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు పిపిఆర్ వ్యాక్సినేషన్ చేసి మాట్లాడారు. పారుడు వ్యాధి ఓ వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాధి రావడంతో జీవాల్లో జీర్ణ, శ్వాస, నాడీ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. వంద శాతం సబ్సిడీతో రైతులకు ఉచితంగా ఈ టీకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎల్ఓ డాక్టర్ సుజాత, ఓఎస్‌లు ఎం రేణుక, శివశంకర్, మాధవి రైతులు పాల్గొన్నారు.