కోదాడ, జనవరి 27 : పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నెల 24న కోదాడ పట్టణంలో చలో కోదాడ నిరసన ర్యాలీ నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటూ మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు పోలీసులు నోటీసులు అందించారు. అందుకు మాజీ ఎమ్మెల్యే స్పందించారు. నిరసన ర్యాలీని తాము ప్రశాంతంగా నిర్వహించామని, ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలిగించలేదన్నారు. అయినప్పటికీ పోలీసులు అందించిన నోటీసులకు చట్టబద్ధంగా సమాధానం చెబుతానని పేర్కొన్నారు.