యాదాద్రి భువనగిరి : అక్రమంగా గంజాయి, యాషిస్ ఆయిల్‌ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రంలోని కాసరగడ్ జిల్లా పైవైలిక గ్రామానికి చెందిన మహ్మద్ అన్సర్ (19), కర్ణాటక రాష్ట్రంలోని మంగొలోరే జిల్లా కిన్యా గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ హాసైనర్ (42) కారులో100 కేజీల గంజాయి, 10 లీటర్ల యాసిస్ ఆయిల్‌ను తరలిస్తుండగా.. చౌటుప్పల్ మండలం గుండ్ల బావి వద్ద గ్రామ 65వ జాతీయ రహదారిపై శనివారం పోలీసులు పట్టుకున్నారు.
వారి వద్ద మాదకద్రవ్యాలతో పాటు మూడు సెల్ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లంబసింగిలో అక్రమంగా గంజాయిని గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి బెంగళూరు మీదుగా కేరళకు తరలిస్తుండగా పట్టుబడ్డారని వివరాలను వెల్లడించారు. గతంలో కూడా వీరు ఇదే మార్గంగుండా గంజాయిని తరలించారన్నారు.