పెన్పహాడ్, జూలై 04 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అనంతారం గ్రామస్తుల సమాచారంతో స్థానిక పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రి మర్చూరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.