నీలగిరి,. జూలై 19 : నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు. రోడ్డు ఆక్రమణ కట్టడాలు, ఆస్తులను స్వచ్ఛందంగా తొలగించుకోవాలన్నారు. శనివారం బస్టాండ్ నుండి గొల్లగూడెం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను, మిర్యాలగూడ రోడ్లో జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ రోడ్డు విస్తరణలో కొన్ని కట్టడాలు తొలగించుకోకపోవడం వల్ల ఆలస్యం అవుతున్నాయన్నారు.
వాటిని యజమానులు రెండు రోజుల్లో తొలగించుకోవాలని నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. వారే స్వచ్ఛందంగా తొలగిస్తే మరింత వేగవంతంగా పనులను పూర్తి చేయవచ్చన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ రోడ్లో టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మిసున్న కల్వర్టు స్లాబ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. ఆయన వెంట డీఈఈ అశోక్, ఏసీపీ కృష్ణవేణి, టీపీఓ సుకన్య, టీపీబీఓ ఆఫీఫ్ రెహ్మాన్ ఉన్నారు.