కట్టంగూర్, నవంబర్ 20 : నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరు ఏడుకొండలు, జడ్పీటీసీ తరాల బలరాములు ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు మండల కేంద్రంలో ర్యాలీగా వచ్చారు. అనంతరం లారీలు, డీసీఎం లు, ఇతర వాహనాల్లో నకిరేకల్‌కు వెళ్లారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గుర్రం సైదులు, పాలడుగు హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, భారీ ఎత్తున తరలివెళ్లారు. లారీలు, డీసీఎంలు వ్యక్తిగత వాహనాల్లో ప్రజలు తరలారు. నకిరేకల్ తరలిన వారిలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, బీఆర్ఎస్ మం డల అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఆవుల అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, వెలిమినేడు పీఏసీఎస్ చైర్మన్ రుద్రారం భిక్షపతి, చిట్యాల వైస్ చైర్మన్ మెండె సైదులు, నాయకులు కర్నాటి ఉప్పలవెంకట్‌రెడ్డి, శేపూరి రవీందర్, కూనూరు సంజయ్దాసు, గుండెబోయి న సైదులు, పల్లపు బుద్దుడు, గోధుమగడ్డ జలంధర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు .
నార్కట్‌పల్లి : నకిరేకల్‌లో సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల కార్యకర్తలు నాయకులు, ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. జై కేసీఆర్,అంటూ నినాదాలు చేస్తూ డీసీఎంలలో తరలి వెళ్లారు.
కేతేపల్లి : ప్రజాశీర్వాద సభకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి డీసీఎం వాహనాలు, ఆటోలు, బైక్‌లపై తరలివెళ్లారు.సభకు వెళ్లిన వారిలో పార్టీ మండలాధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, జడ్పీటీసీ బొప్ప ని స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నాయకులు బి.శ్రీనివాస్‌యాదవ్, చల్ల కృష్ణారెడ్డి, బచ్చు జానకీరాములు, గోలి వేణుమాధవరెడ్డి, బంటు మహేందర్, డి.సుధాకర్, కె.సైదులుగౌడ్ ఉన్నారు.