కోదాడ, ఆగస్టు 20 : పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు సభ్యత్వాలను అందజేసి మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 23న హైదరాబాద్లో జరిగే ధర్నాకు ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పాండురంగాచారి, కోదాడ టౌన్ ప్రధాన కార్యదర్శి సైదిరెడ్డి, కోదాడ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మైసయ్య, శ్రీనివాసరావు, బుల్లయ్య పాల్గొన్నారు.