వేములపల్లి, నవంబర్ 6: విష ఆహారం తిని వందకుపైగా గొర్రెలు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాల్, దోసపాడు గ్రామానికి చెందిన కడమంచి రాములు, ఉప్పనూతల సైదులు, వేములపల్లి మం డలం తిమ్మారెడ్డిగూడానికి చెందిన ఆవుల కోటయ్య తమ గొర్రెలను మం డల కేంద్రం సమీపంలోని పొలాల్లో మేతకు తోలుకొచ్చారు.
వరి కొయ్యల్లోని విష ఆహారం తినడంతో బుధవారం రాత్రి సుమారు 80 గొర్రెలు, గురువారం ఉదయం మరో 40కి పైగా గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. దీంతో సుమారు రూ.20లక్షల మేర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి రమేశ్ తమ బృందంతో కలిసి పరిశీలించారు.మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించడంతోపాటు నీరసించిన గొర్రెల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.