నల్లగొండ సిటీ, డిసెంబర్ 31 : నల్లగొండ ఎస్పీ అపూర్వరావును బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. జిల్లా కొత్త ఎస్పీగా చందనా దీప్తిని నియమించారు.
2023 జనవరి 26న నల్లగొండ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అపూర్వరావు ఇక్కడ 11 నెలల పాటు విధులు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. కొత్త ఎస్పీగా వస్తున్న చందనాదీప్తికి జిల్లాతో సంబంధం ఉన్నది. 2012లో ఐపీఎస్‌గా ఎంపికైన ఆమె.. శిక్షణ నిమిత్తం జిల్లాలో 6నెలల పాటు ట్రైనీ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆమె ఒకటి, రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు.