– వైద్యాధికారి డాక్టర్ రమ్య
ఆత్మకూర్, ఏప్రిల్ 25 : ఇల్లు, ఇంటి పరిసరాల్లో వారానికి ఒకసారి నీరు నిల్వ లేకుండా డ్రై డే పాటించాలని, దోమలు పెరగకుండా నియంత్రించాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రమ్య అన్నారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్మకూర్ ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశం నుండి 2030 నాటికి మలేరియా అంతం చేయాలనే తపన ఇప్పుడు మనం చేయగలం అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఎవరైనా జ్వరం బారిన పడినట్లయితే ఆరోగ్య సిబ్బంది లేదా ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు నిర్వహించుకుని నిర్ధారణ అయితే మందులు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి చెరుకు యాదగిరి, హెల్త్ సూపర్వైజర్ భూతరాజు సైదులు, మాణిక్య, నర్సింగ్ ఆఫీసర్ మానస, మహబూబా, హెల్త్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.