చింతలపాలెం, జూన్ 03 : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు మండల విధ్యాధికారి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీహెచ్‌డబ్య్లూ, సీఈసీ గ్రూపుల్లో అర్హత ఉన్న మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఎస్ఈ బీఈడీ అర్హత కలిగి ఉండాలన్నారు. తెలుగు-1, ఇంగ్లీష్-1, సివిక్స్-1, ఎకనామిక్స్-1, కామర్స్-1, నర్సింగ్-1 పోస్టులకు జూన్ 4 నుండి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను కాలేజీ స్పెషల్ ఆఫీసర్‌కు సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు స్పెషల్ ఆఫీసర్ టి.ప్రసన్నను సంప్రదించాలని సూచించారు.