రైతు ఆశలు ఆవిరి… వానలు రాకపాయె..ఉన్న రెండు బోర్లు ఎండిపాయె
వానకాలంలో రైతులు వర్షాలపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. బోర్లను నమ్ముకొని వరి సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బొందుగులకు చెందిన బాల్ద నరసయ్య తనకు ఉన్న మూడెకరాల భూమిలో రెండు బోర్లపై ఆధారపడి వానకాలం సీజన్లో వరి సాగు చేశాడు.
- రూ.లక్ష పెట్టుబడి.. కండ్ల ఎదుటే ఎండిన వరి
- పశువులకు మేతగా వదిలిన రైతు.. ఆదుకోవాలని వేడుకోలు
రాజాపేట, ఆగస్టు 20 : వానకాలంలో రైతులు వర్షాలపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. బోర్లను నమ్ముకొని వరి సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బొందుగులకు చెందిన బాల్ద నరసయ్య తనకు ఉన్న మూడెకరాల భూమిలో రెండు బోర్లపై ఆధారపడి వానకాలం సీజన్లో వరి సాగు చేశాడు. పంట సాగు కోసం సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. బోర్లలో నీరు లేకపోవడంతో వరి పంటకు సాగునీరు అంద లేదు.
కండ్ల ఎదుటే పచ్చగా ఉండాల్సిన పైరు క్రమంగా ఎండిపోయి, చివరకు పూర్తిగా దెబ్బతింది. చేసేదేమీ లేక ఎండిన వరి చేనును పశువులకు మేతగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘మూడెకరాల్లో వరి సాగు చేశా. రెండు బోర్లను నమ్ముకొని రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. వర్షాలు కురిస్తే పంట చేతికి వస్తుందని ఆశపడ్డా. కానీ వానల్లేక రెండు బోర్లూ ఎండిపోయాయి. పంటకు నీరందక మొత్తం ఎండిపోయింది. చివరకు పశువులకు మేతగా వదిలేయాల్సి వచ్చింది. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. ప్రభుత్వం పంట నష్టాన్ని పరిశీలించి ఆదుకోవాలి’ అని రైతు నరసయ్య కన్నీటిపర్యంతమయ్యాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

