రామగిరి, జనవరి 12 : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని రామగిరిలో గల సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిరాటోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ప్రముఖ ప్రవచకుడు కోగంటి వెంకటాచార్య స్వామి తిరుప్పావై ప్రవచనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు దంపతులు, ధర్మకర్తలు కె.లక్ష్మీనారాయణ, వేదాంతం శ్రీనివాసాచార్యులు, మిర్యాల స్వామి, యాటా జయప్రద, అర్చకులు సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాచార్యులు, రఘునందనాచార్యులు పాల్గొన్నారు.
13న స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శతఘటాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కల్యాణ వేదికపై అంగరంగ వైభవంగ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణోత్సవం తిలకించేందుకు వస్తారు.
ఘనంగా ఎదుర్కోలు
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న గోదారంగనాయక స్వామి తిరు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల మహోత్సవం ఘనంగా జరుగనుంది.