రామగిరి, జూలై 02 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి వివిధ సబ్జెక్ట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సమ్రుదాల ఉపేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీ.ఏ, బీ.కాం, బీఎస్సీ, పీజీ తెలుగు, అర్థశ్రాస్తం, వ్యాపార శ్రాస్తం (కామర్స్), రసాయన శ్రాస్తం, జంతుశ్రాస్తం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో సబ్జెక్ట్‌ల వారిగా, ఓవరాల్‌గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సుమారు 30 మందికి బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇందుకు ఔత్సాహిక వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పార్రిశామిక వేత్తలు, పురప్రముఖులు, ఉద్యోగులు, వివిధ విద్యా, వ్యాపార సంస్థల నుండి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బంగారు పతకానికి రూ.1.5 లక్షలు కళాశాల బ్యాంక్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. రూ.1,50,000 డిపాజిట్ చేసిన వారి పేరు మీద లేదా వారు సూచించిన వారి పేరు మీద ప్రతి విద్యా సంవత్సరం బంగారు పతకాలు ఇవ్వబడుతాయన్నారు. ఈ నెల 22వ తేదీన కళాశాల స్థాపక దినోత్సవం రోజున ఈ బంగారు పతకాల ప్రదాన కార్య్రకమం ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు 98486 96776 సంప్రదించాలని ఆయన కోరారు.